రైతులకు గుడ్ న్యూస్.. జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ?

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆగస్టు 15లోగా ₹2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. జులై 15 నుంచి ₹50వేల లోపు, ఆ తర్వాత ₹75వేలు, ₹లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి ₹లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి AUG 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట. రైతు సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం రూ.30వేల కోట్లు అవసరం అని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రిజర్వు బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love