Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలు.. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 
నవతెలంగాణ-వనపర్తి 

ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం జయన్నతిరుమలాపురం గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లను అందించారు. ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు సమాజ అభివృద్ధికి పునాదులుగా నిలుస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం ప్రజా ప్రభుత్వం అందజేస్తుందని అలాగే మెరుగైన సౌకర్యాలు కల్పించబడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని,విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి దేశ భవిష్యత్తును నిర్మించే నాయకులు, శాస్త్రవేత్తలు, అధికారులు తయారవుతారని డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -