నవతెలంగాణ-తుంగతుర్తి
కల్లాలల్లో వున్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బిఆర్ఎస్ మట్టిపల్లి వెంకట్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలతో ధాన్యము తడిసి రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, అధికారులు మెుద్దు నిద్ర పోతున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు రెండు నెలలుగా ఇంకేపీ కేంద్రాలలో ధాన్యాన్ని రైతులు కాపాడుకుంటూ వస్తున్నారు. రైతులు నార్లు పోసేవరుకు కూడ ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడం సిగ్గు చేటు అని వారు అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధన్యాము పూర్తిగా తడిసి మెులకలు వస్తున్నాయని ఇదే అదునుగా చూసి మిల్లర్ లు రైతులు నుండి కటింగ్ పేరుతో కింటాకు 4 కేజీలను తరుగు పేరుతో దోచుకుంటున్నారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే తరుగు లేకుండా కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


