ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. షాబాద్‌లో జరిగిన సంఘటన అందుకు నిదర్శనమని అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోక్సో నిందితుడికి బెయిల్ ఇప్పించి ఆరుగురి ప్రాణాలను ప్రభుత్వం బలిగొన్నదని శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. షాబాద్‌లో జరిగిన ఈ ఆరు హత్యలు సాధారణ హత్యలు కావనీ, ఇవి ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. ఆడపిల్ల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇలాంటి మానవ మృగాలకు బెయిల్ ఎందుకు లభిస్తోందనీ, ఏ కారణంతో ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర నేరస్థులను మళ్లీ సమాజంలోకి వదులుతోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరు హత్యలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళల భద్రతలో ప్రభుత్వ వైఫల్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



