ఆగస్టు 15న ఖైదీల విడుదలకు గవర్నర్‌ ఆమోదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆగస్టు 15న ఖైదీల విడుదలకు గవర్నర్ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు రెండుగంటల పాటు ఇరువురి మధ్య భేటీ సాగింది. ఈ సందర్భంగా గవర్నర్‌తో సీఎం లంచ్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపై చర్చ, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఆగస్టు 15న ఖైదీల విడుదల, రాష్ట్ర విభజన అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్ ఖైదీలకు క్షమాభిక్ష కల్పించడం, శిక్షల నుంచి ఉపశమనం కల్పించే అధికారం ఉన్నది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు.

Spread the love