అంబేద్కర్‌ కు గవర్నర్‌ నివాళి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి రాష్ట్ర గవర్నర్‌ సీ.పీ.రాధాకృష్ణన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా గవర్నర్‌ మాట్లాడుతూ దేశ చరిత్రను అంబేద్కర్‌ ప్రభావితం చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వ భావనలను మౌలిక సూత్రాలుగా పేర్కొన్న మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమాఖ్య భావన వంటి వాటితో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాల ఏర్పాటుకు కూడా రాజ్యాంగం దోహదం చేసిందని తెలిపారు.

Spread the love