మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)
పలు జిల్లాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
గ్రామపంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధ వారం పలు జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా జీపీ సిబ్బంది, కార్మికులను పర్మినెంట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు తమ సమస్యలపై నిర్వహిస్తున్న దీక్షలు రెండవ రోజుకు చేరాయి. సీపీఐ(ఎం), సీపీఐ, సీఐటీయూ నాయకులు సంఘీభావం, మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు. పెనుబల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించి ఎంపీడీవోకి వినతి పత్రం అంద జేశారు. తిరుమలాయపాలెంలో ప్రధాన కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎంపీడీవో రవీందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంపీఓ ఇస్మాయిల్‌కు వినతిపత్రం అందజేశారు. కట్టం గూరులో మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష నిర్వ హించారు. మునుగోడులో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నార్కట్‌పల్లిలోని ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. మర్రిగూడలో రెండోరోజూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిట్యాల మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీడీఓ పాండుకు, ఎంపీఓ కోటేశ్‌కు, సూపరింటెండెంట్ మనోహర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కారోబార్లు, కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



