రోడ్లపైనే ధాన్యం ఆరబోత

– ప్రమాదాలకు నెలవు, పట్టించుకోని అధికారులు

నవతెలంగాణ – పెద్దవంగర
రోడ్లపై రైతులు ధాన్యం కుప్పలు ఆర బోస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రధాన రహదారులపై వరి ధాన్యం కుప్పలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. రైతులు ఇష్టానుసారం రోడ్డుపై ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు మరింత ఊతమిస్తోందని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవంగర మండల పరిధిలోని ఉప్పెరగూడెం గ్రామంలో రోడ్డులో అడుగడుగునా ధాన్యం ఆరబెడుతున్నారు. గ్రామం నుండి నాంచారి మడుర్ వెళ్ళే రహదారి పై దాన్ని ఆరబోస్తున్నడంతో వాన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మూల ముడతలు కూడా చూడకుండా దాన్ని అరబోయడంతో ప్రమాదాలకు నెలవు గా మారింది. రోజంతా ఆరబోసిన ధాన్యం సాయంత్రం కాగానే ఎక్కడిక్కడే కుప్పలుగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ ఆరోబోస్తున్నారు. రాత్రంతా ధాన్యం కుప్పలు అక్కడే ఉంచడంతో చీకట్లో కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Spread the love