కమనీయం.. సీతారాముల కళ్యాణం 

– భారీగా తరలివచ్చిన భక్తులు.. ఆలయాల్లో అన్నదానాలు
నవతెలంగాణ  – పెద్దవంగర
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల సాక్షిగా అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. బుధవారం మండలంలోని చిట్యాల, ఉప్పెరగూడెం, గంట్లకుంట, పెద్దవంగర గ్రామాల్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాల్లో సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి.. రాముల వారితో సీత మెడలో తాళి కట్టించారు. ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తులు తరించిపయారు. పలు జంటలు కళ్యాణంలో కూర్చున్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు మాజీ సర్పంచులు జమున సమ్మయ్య, చింతల భాస్కర్, వేముల బుచ్చి రాములు, వేముల రఘు, వేముల వెంకన్న, దుంపల కుమారస్వామి, బైన మేనక నవీన్, వేముల సుమలత రాము, ఎండీ షర్ఫుద్దీన్, స్వామి, రాజు, వినోద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love