Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధికై గ్రామసభ: కార్యదర్శి

గ్రామాభివృద్ధికై గ్రామసభ: కార్యదర్శి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా సోమవారం బస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో మహిళలతో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో  మహిళలకు పురుషులతో సమానంగా భాగస్వామ్యం కల్పించేందుకు గ్రామంలోని మహిళా నాయకులు గ్రామ సంఘాల సభ్యులు వార్డు సభ్యులు సర్పంచులు ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధిలో తమ వంతుగా పాల్గొని సహకరించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో  నిర్వహించాల్సిన కొత్త పనులకు కూడా మహిళలు అవసరాలు ఏంటో గ్రామసభలో తెలియచేసి తీర్మానాలు చేసుకొని అభివృద్ధి లో మహిళల పాత్ర ప్రాముఖ్యత ఉండేవిధంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,  ఉపసర్పంచ్ , జీపీ కార్యదర్శి, మహిళా వార్డు సభ్యులు , గ్రామ సంఘాల సభ్యులు , గ్రామ పెద్దలు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -