ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు 

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ మాట్లాడుతూ,స్వతంత్ర సమరయోధుడు, దళితుల హక్కుల కొరకు పోరాటం చేసిన మహానీయుడు, దళిత జాతి ముద్దుబిడ్డ  మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ అని ఆయన జ్ఞాపకాలను  కొనియాడారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అంతడుపుల సతీష్ ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి ఓదెలు, బొజ్జ రవి, సీనియర్ నాయకులు కనకం శంకర్, సీనియర్ నాయకులు దేవనూరి కిష్టయ్య, సముద్రాల సంపత్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love