Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేములలో ఘనంగా కోట మైసమ్మ బోనాలు 

వేములలో ఘనంగా కోట మైసమ్మ బోనాలు 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
మండల పరిధిలోని వేముల గ్రామంలో ఆదివారం కోట మైసమ్మ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు బోనాలను అలంకరించి, తలపై ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్ళి కోట మైసమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి గుడి ముందు కోళ్ళను కోసి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలనీ, రైతుల ఇండ్లలో సిరులు కురవాలని, ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా ఉండాలని తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ ఆంజనేయులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపిటిసి సభ్యులు యశోద, చెన్నయ్య, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, వీరారెడ్డి, మైసయ్య, భీమ్ రాజ్, నరేష్ గౌడ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -