నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేమ్రాజ్ కల్లానిలో మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న, డోన్ గావ్ గ్రామ సర్పంచ్ శ్రీనివాసా ఆధ్వర్యంలో, సావర్గావ్ మాజీ సర్పంచ్ కిషన్, మాదాపూర్ సర్పంచ్ ఆశా చందర్ పటేల్, మతుర తండా సర్పంచ్ అనిత చౌవాన్ , అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయా జిపి గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ఉద్దేశంతో త్రాగునీరు తాగునీరు ఉచిత విద్యుత్తు మంచిన బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



