నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలో ఈ సీజన్‌లో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేశారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో సరైన ధరలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ తరపున సోమవారం జుక్కల్ ఎమ్మార్వో మారుతికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లి గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎమ్మెస్ పి (MSP) ఉన్నప్పటికీ, మండలంలో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీని వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారని అన్నారు. జుక్కల్ మండలంలో వెంటనే మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యవర్తుల అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించక పోతే, బిఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



