నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభం
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రతిష్ఠాత్మక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోప్రారంభమైంది. బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ గౌరవ సలహాదారు, మాజీ ఎంపీ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, బత్తిని కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి 8:40 నిమిషాలకు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.మొదటి చేప ప్రసాదాన్ని బత్తినని అమర్‌నాథ్ గౌడ్ మాజీ ఎంపీ హనుమంతరావుకు వేయగా, అనంతరం మెట్టు సాయికుమార్‌కు వేశారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న చేప ప్రసాదం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఉబ్బసం సమస్యతో బాధపడుతున్న వేలాది మంది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి బత్తినీ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, గత 15 రోజులుగా వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కార్యక్రమానికి వచ్చే వారు ప్రశాంతంగా చేప ప్రసాదాన్ని స్వీకరించాలని సూచించారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మాట్లాడుతూ.. బత్తినీ కుటుంబం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయాలని గత రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బత్తినీ అమర్‌నాథ్ గౌడ్, బత్తినీ గౌరీశంకర్, బత్తినీ చంద్రశేఖర్, బత్తినీ సంతోష్, బత్తినీ శివశంకర్, బత్తినీ దీపిక, బత్తినీ విజయ, బత్తినీ శైలజ, బత్తినీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చేప ప్రసాదం పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


