ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ అధ్యక్షరాలు లోలపు గౌతమి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ఆంజనేయులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద అధ్యక్షులు సుంకేట రవి, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయ వద్ద గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి, తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆయా గ్రామాల్లో  సర్పంచ్లు మాట్లాడుతూ  తెలంగాణ రాకముందు ఉద్యోగాలు, నిధులు,నీళ్లు, నియామకాలలో ఆంధ్ర వారి పాలనలో అణిచివేతకు గురి అయ్యి తొలి దశ, మలిదశ ఉద్యమం ద్వారా పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించినటువంటి ఫలితాలను వివరించారు. కుల, మత, వర్గ బేధం లేకుండా అందరం కలిసికట్టుగా ఉత్సవాలను జరుపుకుంటూ ఇదే స్ఫూర్తితో మండలాన్ని అన్ని రంగాలలో ముందుండేలా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ మైలారం గంగాధర్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఏపిఎం కుంట గంగారెడ్డి, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఆయా గ్రామాల్లో ఎంపీటీసీలు,  పంచాయతీ కార్యదర్శులు, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love