నవతెలంగాణ – హైదరాబాద్: ద్రాక్ష పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్ లో సోమవారం గ్రేప్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపు తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డి, ప్రఖ్యాత ద్రాక్ష నిపుణుడు డాక్టర్ ఎస్ డి శిఖామణి, పద్మశ్రీ చింతల వెంకట రెడ్డి హాజరయ్యారు. ఉపకులపతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ద్రాక్ష సాగులో రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి వాతావరణంలో వచ్చే మార్పులు గమనించి, అధిక దిగుబడి కోసం కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రైతులు సాగులో సమస్యలపై నేరుగా మా పరిశోధ కేంద్రాలను సంప్రదించవచ్చు అని తెలిపారు. తక్షణమే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రైతులకు వివరించారు. తెలంగాణ ప్రాంతంలో పండించే 19 రకాల ద్రాక్ష పండ్లను ప్రదర్శనకి ఉంచారు. వివిధ రకాల ద్రాక్ష పండు సాగులో ఎదురయ్యే సమస్యలపై, దిగుబడిపై రైతులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఏ భగవాన్, డిఆర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రధాన శాస్త్రవేత్త జోనల్ హెడ్ డాక్టర్ టి సురేష్ కుమార్ రెడ్డి, పేథాలజిస్ట్ డాక్టర్ వెంకట రమేష్, పోరికల్చర్ హెడ్ డాక్టర్ జి జ్యోతి, తదితర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.