Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతినీలి చూపుల గ్రాఫిక్స్‌..!

నీలి చూపుల గ్రాఫిక్స్‌..!

- Advertisement -

కాలం కావస్తోందని
వేగంగా నడుస్తున్నాయి
నా అడుగుల లయలు
మండుటెండ లోయలో
యూనివర్సిటీ నడిరోడ్డుపై..!
ఎందుకేనేమో ఎలక్ట్రిక్‌
స్కూటీ పై నువ్వు గమనానివై..!
మల్లె పూల సువాసనల
వెన్నెల వర్షం కురిపించావు
నీ నీలి చూపుల గ్రాఫిక్స్‌
హెల్మెట్‌ మాయాజాలంతో…!!
సప్త వర్ణాల సమ్మిళిత సాఫ్ట్వేర్‌
అందమైన అమ్మాయిలా
మారిందనుకున్నాను..!
నిన్ను చూస్తూనే
తొలి సారిగా నాలోని ప్రాణ
హార్ట్‌ వేర్‌ నీ వెంటే కదిలింది
నా అనుమతి లేకుండా..!!
ఏవో కలిసాయి తొలిసారి
ఎప్పుడొస్తుంది ఇంకొకసారి
నా కాళ్ళ స్కూటీకి తాళం వేశావు
నా కలల సందడికి నీ ఊహల స్టాంపేశావు..
రాజమౌళి సినిమాలా..!
నా భావాల రసాయన చర్యల్లో
ఫిజిక్స్‌ మాధ్యమంగా వచ్చి
ఉత్ప్రేరకంగా వెళ్లిపోతున్నావు
నాకు మాత్రం నిద్రలేని రాత్రుల్లో
ఇళయరాజా పాటలు వినిపిస్తున్నావు..!
ప్రతిరోజూ అదే దారిలో
నా గుండె కొట్టుకుంటూ
రెహమాన్‌ పాటలతో
మళ్లీ నువ్వు ఎప్పుడొస్తావని
ఎదురుచూపుల సంగీతమై
స్వాగత తోరణాలు కట్టేస్తోంది..!!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -