ఘనంగా దశాబ్ది ఉత్సవాలు..

నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు,అయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు,పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,ఎఎంసీ చైర్మన్ కచ్చు చంద్రకళ, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు,ఎంపీడీఓ అంజయ్య, ఎంపీఓ విష్ణు వర్దన్,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు,ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది హజరయ్యారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అకాంక్ష అపహస్యమవుతోందని.. బహుజన తెలంగాణ రాష్ట్ర సాధనకు మరోసారి ప్రజలు పోరాటానికి సిద్దమవ్వాలని బీఎస్పీ మండలాధ్యక్షుడు మాతంగి తిరుపతి సూచించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బీఎస్పీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి రోజు బీఎస్పీ అద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుసరించిన విధానాలను ప్రజలకు వివరిస్తామని తిరుపతి తెలిపారు. బీఎస్పీ మండల నాయకులు హజరయ్యారు.

Spread the love