ఘనంగా పోచమ్మ బోనాలు

నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలోని వీరాపూర్,ముత్తన్నపేట గ్రామాల్లో విశ్వ బ్రహ్మణ,మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో అదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఊరేగింపుగా వేళ్లి గ్రామ దేవత పోచమ్మ ఆలయం వద్ద ప్రజలు అయురారోగ్యాలతో జీవనం సాగిస్తూ, రైతులు సాగుచేసిన పంటలతో ఆశించిన దిగుబడులను సాధించి ఆర్థిక పురోగతి సాధించాలని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అయా సంఘాల నాయకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love