అర్బన్ పార్కు లో హరితోత్సవం..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి గ్రామ శివారులోని అరణ్య అర్బన్ పార్క్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు, బారాస పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశాన్న గారి జీవన్ రెడ్డి, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింత మల్లారెడ్డి, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీపీ మస్త ప్రభాకర్, టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, అటవీశాఖ అధికారులు, బారాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love