– మహారాష్ట్ర ఉన్నతాధికారుల బృందం కితాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణకు హరితహారం అద్భుత ఫలితాలు రాబట్టిందని మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ అండ్ అటవీశాఖ) బీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఫలితాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన మహారాష్ట్ర ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్ అరణ్య భవన్‌లో రాష్ట్ర అటవీశాఖ అధికారులతో భేటీ అయ్యింది. అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఆఫ్‌ఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ మహారాష్ట్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరితహారం ఫలితాలను వివరించారు. రాజకీయ సంకల్పానికి అధికారుల కృషి తోడై ఈ ఫలితాలు సాధించారని మహారాష్ట్ర అధికారులు ప్రశసించారు. సమావేశంలో మహారాష్ట్ర అదనపు పీసీసీఎఫ్ (ప్లానింగ్, డెవలప్ మెంట్) పీ కళ్యాణ్‌కుమార్, అదనపు పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) వివేక్ కందేఖర్, తెలంగాణ పీసీసీఎఫ్‌లు ఏలూసింగ్ మేరు, సువర్ణ, ఎం.సీ.పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, హరితనిధి ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.