నెమ్లిలో హరితహారం చెట్ల నరికి వేత..

– గ్రామ కార్యదర్శి పై గ్రామస్తుల ఆగ్రహం 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తూట్లు పడుతున్నాయి. బాన్సువాడ, బోధన్ వెళ్లే రహదారి మధ్యలో నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామం కు వెళ్లే రహదారికి  ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లను గ్రామపంచాయతీ సిబ్బందే  ఇష్టానుసారంగా నరికి వేస్తున్నారు.  బాన్సువాడ, బోధన్ రహదారి నుంచి గ్రామంలో కి వెళ్లే దారిలో హరితహారం చెట్లను నెమ్లీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇష్టమొచ్చినట్లు తొలగిస్తున్నారు. ఒక్క మొక్కను నరికితే వంద మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నినాదాలు చేస్తుంటే. ఎన్నో ఏండ్లుగా గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది  పెంచి పోషిస్తున్న వారే చెట్లను నరికి వేయడంతో గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపుగా పెరిగిన చెట్లను నరకడం ఎందుకు?  ఎండ్లు తరబడి వాటిని పెంచడం ఎందుకు అంటూ గ్రామస్తులు  ప్రశ్నిస్తున్నారు. ఈపుగా పెరిగిన చెట్లను ఎందుకు నరికివేస్తున్నారంటూ గ్రామస్తులు ప్రశ్నించగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు తాము చెట్లు నరికి వేస్తున్నామని గ్రామపంచాయతీ కార్మికులు తెలిపారు. సోమవారం దుర్కి గ్రామంలో హరితహారం చెట్లను నరికి వేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ నసురుల్లాబాద్ ఎంపీడీవో నీలావతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సోమవారం మండలం లోని దుర్కీ గ్రామంలో హరితహరం చెట్లను తొలగించిన ఘటన మర్చిపోకముందే నెమలి తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దాదాపు 20 కి పైగా చెట్లను నరికివేశారు. చెట్లను నరికేస్తే కేసులు పెడతామని హెచ్చరించే అటవీ శాఖ అధికారులు. నేతల మాటలువిని  ఇష్టానుసారంగా కొట్టేయిస్తుంటే కనీసం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం: ఎంపీడీవో నీలవతి
మండలంలోని నెమలి గ్రామంలో హరితహారం చెట్లను నరికివేసినట్లు తమకు సమాచారం అందిందని ఆ గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ జరిపి అనుమతి లేకుండా చెట్లను నరికి వేసిన వారిపై తగు చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.
Spread the love