గృహ లక్ష్మీ పథకాన్ని కొనసాగించాలి..

నవతెలంగాణ – మోర్తాడ్

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గృహ లక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులకు మూడు లక్షల రూపాయల రుణాన్ని అందించే పథకాన్ని ప్రారంభించిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా చర్యలు చేపడుతుందని అలా కాకుండా ఆ పథకాన్ని కొనసాగించి అర్హులందరికీ మూడు లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతోపాటు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం తమకు ప్రోసిడింగ్ కూడా ఇవ్వడం జరిగిందని, మూడు లక్షల రూపాయలు వస్తే ఇండ్లు నిర్మించుకోవచ్చు అని ఆశ అది అసలు అవుతున్నాయని అలా కాకుండా తక్షణమే తమకు గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు.
Spread the love