గృహజ్యోతి ఉచిత విద్యుత్ రశీదులు అందజేత

నవతెలంగాణ – బెజ్జంకి 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంలో  శుక్రవారం మండలంలో విద్యుత్ అధికారులు ఆర్హులైన గృహ వినియోగదారులకు సుమారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రశీదులు అందజేశారు. గృహజ్యోతి పథకం రశీదులు అందని గృహ వినియోగదారులు అపోహలకు గురవ్వకుండా ప్రజాపాలన దరఖాస్తు వివరాలతో ఎంపీడీఓ కార్యలయంలో సంప్రదిస్తే వివరాలు నమోదు చేస్తారని బెజ్జంకి, తోటపల్లి విద్యుత్ శాఖ ఏఈలు చాంద్ పాషా,బాలకిషన్ సూచించారు.ఉచిత రశీదులు అందజేతలో అయా విద్యుత్ కార్యలయ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love