నవతెలంగాణ – అశ్వారావుపేట
వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అశ్వారావుపేట పట్టణంలోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో మంగళవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాశ్‌రావు పారతో మట్టిని తవ్వి నిర్మాణ పనులను ప్రారంభించారు.దాతల సహకారంతో వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కురిశెట్టి నాగబాబు నాయుడు మాట్లాడుతూ, జూలై నెలలో మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు దండాబత్తుల ఆదిలక్ష్మి, అట్టం రమ్య, కొట్టే నాగసునీత, వెంకన్నబాబు, ఊట్లపల్లి సర్పంచ్ సత్యం లక్ష్మీకుమారి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్కినేని నరేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, తాడేపల్లి రవి, చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ నరాల శ్రీనివాసరావు, కట్ట శ్రీను, పాశం రామారావు, బండారు శ్రీనివాసరావు, చిన్నంశెట్టి పవన్, దండాబత్తుల నరేష్, కొట్టే శ్రీను, చిన్నంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.



