నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీ సంఘటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజస్థాన్ కోటా భారీ ర్యాలీ చేపట్టానున్నారు. ఈమేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా దేశ యువతకు సందేశం ఇచ్చారు. జూన్ 17న కోటాలో జరిగే “ఎకో ఆఫ్ స్టూడెంట్స్” మెగా ర్యాలీలో దేశవ్యాప్తంగా యువత ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
‘పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, నియామకాల రద్దు, పెరుగుతున్న ఫీజులు, ప్రైవేటీకరణ, కుంభకోణాలు లక్షలాది మంది యువ భారతీయుల కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భారతదేశంలోని ప్రతి యువత భవిష్యత్తును సురక్షితం చేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ బాధ్యత, నిజాయితీ–కానీ, మోడీ ప్రభుత్వ వాటి పట్ల విరుద్ధంగా ఉందని’ ఆయన రాసుకొచ్చారు.



