గ్రూప్ అడ్మిన్ లదె భాధ్యత

నవతెలంగాణ- చిట్యాల 
చిట్యాల పట్టణంలో పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం చిట్యాల మండల అన్ని గ్రామాలలో గల వాట్సాప్ గ్రూపుల అడ్మిన్ సభ్యులకు ఎస్ ఐ  ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం చేశారు.ఈ సమావేశం లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున శాంతిభద్రతల దృశ్య సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని,ఎటువంటి రాజకీయ పోస్టులు రెచ్చగొట్టే విధంగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని,ఏ గ్రూపులో అభ్యంతరకర పోస్టులు కామెంట్లు పెడతారో ఆ గ్రూపు అడ్మిన్ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని రాజకీయాలకు అతీతంగా పోస్టులు ఉండాలని. గ్రూపుల వలన శాంతిభద్రతలు లోపించినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ఎస్ ఐ తెలిపారు.
Spread the love