వచ్చే నెలలో జీశాట్-ఎన్2 ప్రయోగం!

నవతెలంగాణ-హైదరాబాద్ : జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,700 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్‌లోకి పంపనున్నారు. దీని జీవితకాలం 14 ఏళ్లు. దేశ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ దీనిని రూపొందించింది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ సహా భారత్ మొత్తానికి దీని సేవలు అందనున్నాయి.

Spread the love