నిత్యవసర వస్తువులపై జీఎస్టీ ని ఉపసంహరించుకోవాలి

– కార్మికుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
నవతెలంగాణ – శంకరపట్నం
కార్మిక సంఘాలు చేపట్టిన గ్రామీణ బంద్ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య,వామపక్ష ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ అనుపమ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమరెడ్డి రాజిరెడ్డి,లు హాజరై మాట్లాడారు. పేద మధ్య తరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని 60 ఏళ్లు పైబడిన అందరికీ పింఛన్ ఇవ్వాలని స్వామినాథ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర గ్యారంటీ చేసే చట్టం చేయాలి.నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలి.విద్యుత్తు 2022 ను ఉప సవరించాలి.కనీస వేతనం రూ.26000 మరియు పెన్షన్ పదివేల రూపాయలు అందరికీ చెల్లించాలి.అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పనిరోజులు 200కు పెంచాలి. రోజుకు 8 కనిస వేతనం ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న అన్ని వేతనాలు చెల్లించాలి జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టం తేవాలి ధరలు పెరుగుదలను అరికట్టాలి ఆహార వస్తువులు నిత్యవసరాలపై జిఎస్టిని ఉపసహరించాలి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటగ్యాసులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించాలి ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి ఉద్యోగాల్లో కాంటాక్ట్లకు పద్ధతిని ఆపాలి అందరికీ చేయాలి అందరికీ గృహ వసతి కల్పించాలి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలి ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం సహకారం చేయాలి ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి కణం సదానందం, సహాయ కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మైదన్ శెట్టి యుగేందర్,  మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షులు బొజ్జ సాయిలు, సహాయ కార్యదర్శి కొండ రజిత, గ్రామపంచాయతీ మండల అధ్యక్షులు ఎలకపల్లి సారయ్య, అల్వాల జనార్ధన్ మధ్యాహ్న భోజనం మండల కార్యదర్శి సహన బేగం,కత్తిరిమల పద్మ, కదిరే కౌసల్య మెరుగు సారమ్మ భూమయ్య నరేష్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love