16న దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్స్ విడుదల

నవతెలంగాణ – శంకరపట్నం
కేంద్ర ప్రభుత్వం అధికారికల్లోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోర్డులను తీసుకురావడం జరిగిందని ఈనెల 16న దేశవ్యాప్త కార్మిక గ్రామీణ బంద్ సమ్మె ను శుక్రవారం శంకరపట్నం మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కేట్ వద్ద సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ దేశవ్యాప్త కార్మిక సమ్మె మరియు గ్రామీణ బంద్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 16న మండల కేంద్రంలో బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలనిఆయన తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో సీఐటీయూ తో పాటు 97 కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మూర్ఛ, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ సమ్మె ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కొడ్లను తీసుకురావడం జరిగినదని, దీనివల్ల కార్మికుల హక్కులు నిర్వీర్యం అయ్యాయని పెరుగుతున్న ధరల వల్ల కార్మికుల్లో నిజ వేతనాలు పడిపోయాయి. రోజుకు 178 రూపాయలతో బ్రతకండని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ సైన్యం పెరిగినది ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు పని భద్రత లేకుండా పోయినది. అసంఘటిత రంగ కార్మికులు హమాలీ, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్,భవన నిర్మాణ కార్మికులకి, గ్రామ పంచాయతి వర్కర్స్,ఆశ, అంగన్వాడీ,పశు మిత్ర కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదు కార్పోరేట్ సంస్థలకు రూ.2లక్షల 14 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అందుకని కార్మికవర్గం కార్పొరేట్ల బీజేపీ పార్టీనీ పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించడానికి సిద్దం అయ్యాయి.దేశవ్యాప్త కార్మిక సమ్మెతో పాటు గ్రామీణ రైతు, వ్యవసాయ కార్మిక వర్గం గ్రామీణ బంద్ నిర్వహిస్తుంది. ఈనెల 16న శంకరపట్నం మండలంలో బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం నుండి మండల తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేయాలని మండల కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కూలీ వర్గం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ హమాలీ సంఘం అధ్యక్షుడు ఎస్ డి బాబా,నాయకులు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎలుకపల్లి సారయ్య, స్వయంకృషి ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు వంగ బిక్షపతి,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమేష్, చక్రపాణి, స్కూల్ స్విపర్స్ యూనియన్ నాయకులు అంజయ్య,గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ నాయకులు మహేందర్,జనార్ధన్, కిష్టయ్య,సమ్మయ్య,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love