ఆశావర్కర్లకు డిసెంబర్, జనవరి పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి: సీఐటీయూ

– సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ జిల్లాలో ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, బకాయి వేతనాలను చెల్లించాలని డాక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు డిసెంబర్, జనవరి రెండు నెలల పారితోషికాలు ఇంకా రాలేదు. గతంలో ప్రతి నెల 2వ తేదీన పారితోషికాలు ఆశా వర్కర్ల అకౌంట్లో పడేవి, కానీ ఇప్పుడు రెండు నెలలు దాటినా ఆశా వర్కర్లకు నేటికీ పారితోషికాలు అకౌంట్లో పడలేదు. పారితోషికాలు నెలల తరబడి రాకపోవడంతో కుటుంబ అవసరాల కోసం అప్పు చేసి బతకాల్సిన దుర్భర పరిస్థితికి జిల్లా“లో అశా వర్కర్లు నెట్టబడుతున్నారు. 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు, వీరికి నేటికీ కనీస వేతనం లేదు, కనీసం ఫిక్సిడ్ వేతనం కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం చేయలేదు. ప్రభుత్వం చెల్లిస్తున్నవి చాలీచాలని అతి తక్కువ పారితోషికాలు మాత్రమే. ఇవి కూడా సకాలంలో రాకపోవడంతో ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో వైపు పండుగలు క్రిస్టమస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు కూడా ఈ కాలంలో వచ్చాయి. ఇలాంటి సందర్భంలో కూడా. పారితోషికాలు సకాలంలో రాకపోతే ఎలా బతకాలని ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. కావున పై అంశాలను పరిశీలించాలని, డిసెంబర్, జనవరి రెండు నెలల పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని, సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అలాగే పలు డిమాండ్సు పరిష్కరించాలని కోరుతున్నాము అని తెలిపారు. డిసెంబర్, జనవరి రెండు నెలల పారితోషికాలు తక్షణమే చెల్లించాలి. గతంలో ఇచ్చిన విధంగా ప్రతి నెల 2వ తేదీన ఆశాలకు పారితోషికాలు చెల్లించాలి. పారితోషికం లేని అభయ హస్తం, మహాలక్ష్మి తదితర అదనపు పనులు ఆశాలతో చేయించకూడదు. ఏఎన్సీ డెలివరీల పేరుతో టార్గెట్స్ పెట్టి ఆశాలను భయబ్రాంతులకు గురిచేస్తున్న విధానాన్ని రద్దు చేయాలి.సమ్మె సందర్భంగా అక్టోబర్ 9న అధికారులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.పెరుగుతున్న ధరలకనుగుణంగా పారితోషికాలను రూ.18,000/-లకు పెంచి, ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్ సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిన్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలి.ఆశాలకు పి.ఎఫ్, ఇ.ఎన్.ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం రూ.5 లక్షలు ఇవ్వాలి.ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలి. అభయ హస్తం, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఆశాలకు వర్తింపచేయాలి. ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టుల్లో ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. వెయిటేజీ మార్కులు నిర్ణయం చేయాలి. మట్టి ఖర్చులు రూ.50,000/-లు చెల్లించాలి.టిబి స్పూటమ్ డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలి.టి.బి. లెప్రసీ తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.ఆశాలకు పని భారం తగ్గించాలి, జాబ్ చార్టను విడుదల చేయాలి.32 రకాల రిజిష్టరను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలి. క్వాలిటీతో కూడిన యూనిఫామ్స్ ఇవ్వాలి.ఆశాలకు ప్రసూతి సెలవుల పైన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలి. ఆశాలకు జిల్లా మరియు పిహెచ్సి కేంద్రాలలో రెస్ట్రూమ్ ఏర్పాటు చేయాలి.ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా నాయకులు సుకన్య,, బాలమణి, రమ, స్వప్న, రేణుక, లావణ్య లలిత సాహిర భాను, సిహెచ్ నర్స , భాగ్య విజయ లలిత రేణుక రాధా అనసూయ తదితరులు పాల్గొన్నారు.
Spread the love