ఉచిత విద్యుత్ కోరకు భారీగా దరఖాస్తులు

నవతెలంగాణ – జుక్కల్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు పథకాలలో భాగంగా ఉచిత రెండువందల యూనిట్ల విద్యుత్ కోరకు లబ్దిదారుల గుర్తించేందుకు దరఖాస్తులు గ్రామాలలో టీములుగా ఏర్పడి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ సంధర్భంగా హంగర్గ ఫీడర్ లైన్ మెన్ నాగప్పా అధ్వర్యంలో  హంగర్గ, చండేగాం, పడంపల్లి,మాదాపూర్, గ్రామాలలో ఉచిత విద్యుత్ కోరకు అధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ తాజా బిల్లు సర్వీస్ నెం ఉన్నది, ఫోన్ నెంబర్లు, ప్రదాపాలన దరఖాస్తు నమేాదు చేసిన నెంబరు అందించాలని, ఒక రోజు ముందుగానే గ్రామాలలో చాటింపు వేయడం జర్గిందని, 60నుండి 70 శాతం వరకు పూర్తీ చేసామని పేర్కోన్నారు. కార్యక్రమంలో గ్రామ ఆయాగ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love