మార్గదర్శకాలు రూపొందిస్తాం

–  ప్రభుత్వ అధికారులకు సమన్ల జారీపై ‘సుప్రీం’
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్కార కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నిబంధనలు ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ధిక్కార కేసుల్లో అధికారుల హాజరు తప్పనిసరని, ప్రభుత్వ అధికారులను పిలిపించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తామని ధర్మాసనం తెలిపింది.

Spread the love