జిల్లా పద్మశాలి సంఘ భవనంలో గురుపూజోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ-  కంటేశ్వర్

లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్,జెసిఐ ఇందూర్ సంయుక్త ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు నగరంలోని జిల్లా పద్మశాలి సంఘ భవనంలో గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిద ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పది మంది ఉపాద్యాయులను సన్మానించారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన లయన్స్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్ మాట్లాడుతూ ఉపాద్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా ఉత్తములుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరవలేనిదన్నారు.పుస్తకాలలో ఉన్న విషయంతో పాటు ప్రాపంచిక జ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలని ఆయన ఉపాద్యాయులకు సూచించారు. లయన్స్ ఏరియా కో~ఆర్డినేటర్ పి.లక్ష్మినారాయణ,క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జిల్కర్ విజయానంద్, చింతల గంగాదాస్, కోశాధికారి మచ్చ రవీందర్,ప్రోగ్రామ్ చైర్మెన్ ప్రశాంత్,పూర్వాద్యక్షులు పుల్గం హన్మాండ్లు,జెసిఐ ఇందూర్ అద్యక్షులు నయన్, పూర్వ అద్యక్షురాలు లావణ్య, ఉపాద్యక్షురాలు సుకన్య,లయన్స్ క్లబ్ ఉపాద్యక్షులు రవీందర్ గుప్త, డైరెక్టర్లు గర్దాస్ శంకర్, సిలివేరి గణేష్, డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love