– భారత్, బంగ్లా తొలి టీ20 వేదిక మార్పు
ముంబయి: ధర్మశాల క్రికెట్ స్టేడియంలో డ్రెస్సింగ్‌రూమ్ ఆధునీకరణ పనుల కారణంగా భారత్, బంగ్లాదేశ్ తొలి టీ20 మ్యాచ్ ఆతిథ్య హక్కులను వదులుకుంది. ఆ మ్యాచ్‌కు గ్వాలియర్ వేదిక కానుంది. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు వేదికగా నిలవాల్సిన ఈడెన్ గార్డెన్స్.. గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రత ఏర్పాట్ల కారణాలతో తొలి టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి మ్యాచ్ వేదిక చెన్నైలో రెండో టీ20 జరుగనుంది. భారత్, బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.