Monday, August 17, 2026
E-PAPER
Homeఖమ్మంముగిసిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం

ముగిసిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం

- Advertisement -

– పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముగింపు సందర్భంగా సోమవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కలిసి పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, పారిశుధ్యం, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌, డాక్టర్‌ రాములు, డాక్టర్‌ జెమీమా, డాక్టర్‌ రమేష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -