ప్రభుత్వానికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీ.ఎల్.వో డ్యూటీలు చేస్తున్న అంగన్ వాడీ టీచర్ల పై తహసీల్దారుల వేధింపులు ఆపాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఐసీడీఎస్ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌కు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, రాష్ట్ర కార్యదర్శులు జె వెంకటేశ్, ఎం పద్మశ్రీ, పి శ్రీకాంత్ వినతి పత్రాన్ని సమర్పించారు. అంగన్‌వాడీలకు బీఎల్‌ఓ, సర్ డ్యూటీలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు బూత్ లెవల్ , సర్ డ్యూటీలు కేటాయించడం వల్ల గర్భిణీల సంరక్షణ, పౌష్టికాహారం వంటి ప్రధాన బాధ్యతలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలిపారు. పిల్లలకు సేవలు చేయాల్సిన సమయంలో సర్వేలకు వెళ్ళడం వల్ల గర్భిణీలకు అత్యవసర సేవలు చాలా ఆలస్య మవుతుందని పేర్కొన్నారు. అంగన్‌వాడీ టీచర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడిని, పని ఒత్తిడిని ఎదుర్కొం టున్నారని తెలిపారు. ఈ నెల 15 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ప్రయివేట్, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను వారి స్కూళ్లకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అంగన్ వాడీ టీచర్లను మాత్రం బీఎల్ డ్యూటీలు చేయమం టున్నారని తెలిపారు. దీనివల్ల ఆ సెంటర్లలో పిల్లలు లేకపోతే ఆయా సెంటర్లను మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి బీఎల్వో డ్యూటీలు చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లపై స్థానిక అధికారులు, తహసీల్దారులు వేధింపులు, ఒత్తిళ్లకు పాల్పడు తున్నారని పేర్కొన్నారు.ఉదయం 9గంటల నుంచి మధ్యా హ్నం ఒకటింటి వరకు సర్వేలు చేయ మంటు న్నారని తెలిపారు. స్కూల్ టైంలో సర్వేలకు వెళ్ళడం వల్ల గ్రామాల్లో ప్రజలు అంగన్ వాడీ టీచర్లు ఉండడం లేదని పిర్యాదు చేస్తున్నారని పేర్కొ న్నారు. ఆరోగ్య సమస్యల వల్ల అంగన్ వాడీ టీచర్లు చికిత్స నిమిత్తం సెలవులు పెడితే షోకాజ్ నోటీసు లిస్తున్నారని తెలిపారు. మ్యాపింగ్ చేయాలంటే ఉన్న ఫోన్లు సపోర్టు చేయటం లేదని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ టీచర్లపై తహశీల్దారుల వేధింపులు ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



