సీపీఐ (ఎం) నేతల ఘన స్వాగతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనేత మాణిక్ సర్కార్ శనివారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌ను సందర్శించారు. మహబూబ్‌నగర్‌లో ప్రారంభమైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు విచ్చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా ఎంబీ భవన్‌ను సందర్శించిన మాణిక్ సర్కార్‌కు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బండారు రవికుమార్, సీనియర్ నాయకులు డీజీ నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణజ్యోతి, బి సాంబ శివతోపాటు రాష్ట్ర కేంద్రం నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ఆఫీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన దేశ, రాష్ట్ర రాజకీ యాల గురించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య తదితర అంశా లను వారికి కూలంకషంగా వివరించారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో సీపీఐ(ఎం), వామపక్షాలు కీలక పాత్ర పోషిం చాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణా మాల గురించి ఆరా తీశారు. క్యాడర్‌తో ముఖాముఖిగా మాట్లాడుతూ వారి కుటుంబాలు, పిల్లల చదువులు, ఆరోగ్యాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మహబూబ్‌నగర్ బయల్దేరి వెళ్లారు.
ఎంబీ భవన్‌కు మాణిక్ సర్కార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



