కేబీఆర్ పార్క్ వద్ద మహిళా నిర్మాతకు వేధింపులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఓ మహిళా నిర్మాతకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె జాగింగ్ చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి ఫోన్ తో వీడియోలు తీస్తూ, అశ్లీల హావభావాలతో వేధించాడు. అతని వేధింపులను భరించలేని సదరు మహిళా నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్ మల్లేపల్లికి చెందినవాడిగా, బ్లాక్ కలర్ వెర్నా కారులో వచ్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కారును, నిందితుడిని గుర్తించారు.

Spread the love