బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయడం దారుణం
నర్సింగ్ సిబ్బందికి లాంజ్‌లు కేటాయింపులో తాత్సార్యం
యూనియన్‌లో చేరొద్దని వేధిస్తున్నారనే చర్చ
ఇలాగైతే విధులు నిర్వర్తించలేం…సమ్మెలోకి వెళ్తామని నర్సింగ్ యూనియన్ హెచ్చరిక
ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్‌కు బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘నర్సింగ్ సిబ్బందిపై పరిపాలనా వేధింపులు, అవమానకర వ్యవహారాలను ఆపేలా చర్యలు తీసుకోవాలనీ, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వృత్తిపరమైన వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాల్లో జోక్యం చేసుకుని సరిదిద్దాలని ఈఎస్‌ఐసీ నర్సింగ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్‌కి బహిరంగ లేఖ రాసింది. డైరెక్టర్ జనరల్ నుంచి సానుకూల స్పందన రాకపోతే ట్రేడ్ యూనియన్స్ చట్టం-1926 ప్రకారం నిరసన కార్యక్రమాలు చేపడుతామనీ, ఆ తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్షులు ఎం.రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్‌బాబు పేరిట లేఖ విడుదల చేశారు. యూనియన్ తరఫున పలు సమావేశాలు, లిఖితపూర్వక వినతులు, స్నేహపూర్వక పరిష్కార ప్రయత్నాలు చేసినప్పటికీ సార్థకమైన చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు. అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నగోసైన్, నర్సింగ్ ఆఫీస్ ఇన్‌చార్జి బీఎం. సదాశివ్ తీసుకున్న చర్యలకు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్-1, డీన్ డాక్టర్ రత్నగోసైన్ పరిపాలనా మద్దతు అందిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ అధికారులతో జరిపిన చర్చల్లో ‘మీరేం చేస్తారు? ఏం చేయలేరు? వినకపోతే బదిలీ చేస్తాం’ అని ఉన్నతాధికారులు బెదిరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రధాన ఫిర్యాదులు
నిటి అయోగ్ సభ్యులు, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, ఈఎస్‌ఐ సనత్‌నగర్ మాజీ డీన్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ పేరును ఉపయోగించి భయపెట్టడం. నర్సింగ్ ఆఫీసర్ వెంకన్న మాలికంటికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఇలాంటి చర్య అవమానకరం. 16 మంది ఏఎన్‌ఎస్, 57 మంది ఎస్‌ఎన్‌ఓలకు సామూహికంగా మెమోలు జారీ చేయడం
కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లతో యూనియన్ ప్రతినిధులు మాట్లాడినందుకు వివరణలు కోరడం, చట్టబద్ధ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం.
ఏఎన్‌ఎస్‌లకు కేటాయించిన అధికారాలు, బాధ్యతలు తగ్గించడం.
నర్సులకు విశ్రాంతి గది లేదు. ఏఎన్‌ఎస్ గదులు లేవు. యూనియన్‌కు గది కేటాయించలేదు. సిక్‌రూమ్, విశ్రాంతిగదులు, డ్రెస్సింగ్ చేంజ్ రూమలు ఇవ్వకపోవడం.
10. డీపీసీ, ప్రమోషన్లు, ఎమ్‌ఏసీపీ, స్పెషల్ ఏరియా అలవెన్స్ తదితర సేవా అంశాలు ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.
డిమాండ్లు
డాక్టర్ రత్నగోసైన్, సదాశివ్ బీఎంలను బదిలీ చేసి నిష్పాక్షిక విచారణ జరపాలి.
16 మంది ఏఎన్‌ఎస్‌లు, 57 మంది ఎస్‌ఎన్‌ఓలకు జారీ చేసిన మెమోలను ఉపసంహరించాలి.
యూనియన్ కార్యకలాపాలపై కోరిన వివరణలను ఉపసంహరించాలి.
నర్సింగ్ సిబ్బందిని వేధింపులు, బెదిరింపులు మరియు ప్రతీకార చర్యల నుండి రక్షించాలి.
పెండింగ్ సంక్షేమ సౌకర్యాలను వెంటనే కల్పించాలి.
స్పెషల్ ఏరియా అలవెన్స్ కేసులను వెంటనే పరిష్కరించాలి.
ఎమ్‌ఏసీపీ, డీపీసీ, ప్రమోషన్లు మరియు ఇతర సేవా అంశాలను పరిష్కరించాలి.
నర్సింగ్ ఆఫీస్‌లో మాస్టర్ రోటేషన్ విధానాన్ని అమలు చేయాలి.
గౌరవప్రదమైన, పారదర్శకమైన మరియు వేధింపులేని పని వాతావరణాన్ని కల్పించాలి.
ఫిర్యాదులు చేసిన ఉద్యోగులపై ప్రతీకార చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలి.
ఈఎస్‌ఐలో నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



