హరీష్‌రావు వ్యాఖ్యలు కేసీఆర్‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయి

– కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ మంత్రి టి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం శాసనసభ లాబీల్లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. హరీశ్‌ సీఎం కావటానికి ప్లాన్‌లో ఉన్నట్టు అనుమానాలొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన కేసిఆర్‌ను వ్యతిరేకించి తమ పార్టీలోకి వస్తే అందుకు సపోర్ట్‌ చేస్తామన్నారు. కవిత, హరీష్‌, కేటీఆర్‌ల పేర్ల మీద ఆ పార్టీ విడిపోనుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలవడం ఖాయమన్నారు. హరీష్‌ రావు పార్టీలో ఉంటే సీఎం కాదు కదా.. బీఆరెస్‌ ఎల్పీ లీడర్‌ కూడా కాలేడని వ్యాఖ్యానించారు. 20 మందితో ఆయన ఆ పార్టీకి లీడర్‌ కావాలని సూచించారు.

Spread the love