Saturday, June 13, 2026
E-PAPER
Homeఆటలుహ్యారీ బ్రూక్‌ నం.1

హ్యారీ బ్రూక్‌ నం.1

- Advertisement -

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌‌లో అగ్రస్థానం
దుబాయ్‌ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌‌లో ఇంగ్లాండ్‌ ‌యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ అగ్రస్థానం దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌‌తో లార్డ్స్‌ ‌టెస్టులో జో రూట్‌ ‌నిరాశపరచగా.. తొలి ఇన్నింగ్స్‌‌లో అర్థ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్‌ ‌సహచర సీనియర్‌ ‌వరల్డ్‌ ‌నం.1 ర్యాంక్‌‌ను లాగేసుకున్నాడు. అగ్రస్థానం కోల్పోయిన జో రూట్‌ ‌మూడో స్థానానికి పడిపోగా.. ఆస్ర్టేలియా బ్యాటర్‌ ‌ట్రావిశ్‌ ‌హెడ్‌ ‌రెండో స్థానంలో నిలిచాడు. అఫ్గనిస్తాన్‌‌తో టెస్టులో సెంచరీతో మెరిసిన భారత కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌ర్యాంకింగ్స్‌‌లో రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. యువ ఓపెనర్‌ ‌యశస్వి జైస్వాల్‌ ‌తొమ్మిది, రిషబ్‌ ‌పంత్‌ 12వ స్థానాల్లో కొనసాగుతున్నారు. స్టీవ్‌ ‌స్మిత్‌ (ఆస్ర్టేలియా), కామిందు మెండిస్‌ (‌శ్రీలంక) టాప్‌-5‌లో నిలిచారు. బౌలర్ల జాబితాలో జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా, మిచెల్‌ ‌స్టార్క్‌ (ఆస్ట్రేలియా), పాట్‌ ‌కమిన్స్‌ (ఆస్ర్టేలియా), మార్కో యాన్సెన్‌ (‌దక్ష‍ిణాఫ్రికా), స్కాట్‌ ‌బొలాండ్‌ (ఆస్ట్రేలియా)లు టాప్‌-5‌లో కొనసాగుతున్నారు. అఫ్గనిస్థాన్‌‌తో ఏకైక టెస్టుకు దూరమైనా.. నం.1 ఆల్‌‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానం చెక్కుచెదరలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -