స్టోక్స్, అటిక్సన్‌పై వేటు
లండన్ : నైట్‌క్లబ్‌లో గొడవ, వివాదం ఇంగ్లాండ్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన అనంతరం అర్థరాత్రి దాటాక బెన్ స్టోక్స్, గస్ అటిక్సన్‌లు ఓ నైట్‌క్లబ్‌లో తాగుతూ కనిపించారు. దేశవాళీ సీజన్ ముగించుకున్న సారాసెన్స్ రగ్బీ క్లబ్ ఆటగాళ్లు సైతం అదే క్లబ్‌లో ఉన్నారు. గస్ అటిక్సన్, రగ్బీ ప్లేయర్ నడుమ సంభాషణ వాదనకు దారితీయగా.. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ కలుగజేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్‌పై రగ్బీ క్లబ్ ఆటగాడు దాడి చేయగా.. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ క్రికెట్‌లో అర్థరాత్రి కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నా… బెన్ స్టోక్స్, అటిక్సన్‌లు నైట్‌క్లబ్‌కు వెళ్లిన ఘటనపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇండిపెండెంట్ దర్యాప్తనకు ఆదేశించింది. దీంతో ఈ నెల 17 నుంచి ది ఓవల్‌లో ఆరంభం కానున్న రెండో టెస్టుకు బెన్ స్టోక్స్, అటిక్సన్‌లపై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సైతం గత ఏడాది వెల్లింగ్టన్‌లో నైట్‌క్లబ్ బౌన్సర్‌తో గొడవ పడిన నేపథ్యంలో.. రెండో టెస్టుకు సీనియర్ క్రికెటర్ జో రూట్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు. జో రూట్ ఇంగ్లాండ్‌కు 64 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించిన.. చివరి 17 టెస్టుల్లో ఒకే విజయం సాధించటంతో సారథ్య బాధ్యతల నుంచి 2022లో తప్పుకున్నాడు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో జో రూట్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు ఇంగ్లాండ్ క్రికెట బోర్డు తెలిపింది. బెన్ స్టోక్స్, అటిక్సన్ స్థానంలో జోర్డాన్ కాక్స్, జోఫ్రా ఆర్చర్‌లు రెండో టెస్టుకు ఎంపికయ్యారు.
కెప్టెన్‌గా జో రూట్
- Advertisement -
- Advertisement -



