Saturday, June 13, 2026
E-PAPER
Homeఆటలుహార్దిక్‌ పాండ్యకు గాయం

హార్దిక్‌ పాండ్యకు గాయం

- Advertisement -

అఫ్గనిస్తాన్‌‌తో వన్డేలకు దూరం
బెంగళూరు : భారత స్టార్‌ ఆల్‌‌రౌండర్‌ ‌హార్దిక్‌ పాండ్య గాయం బారిన పడ్డాడు. ఈ నెల 13న ధర్మశాల వేదికగా భారత్‌, అఫ్గనిస్తాన్‌ ‌తొలి వన్డే ఆరంభం కానుండగా.. గాయంతో హార్దిక్‌ ‌పాండ్య వన్డే సిరీస్‌‌కు దూరమయ్యాడు. వన్డే సిరీస్‌ ‌కోసం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌‌లో సాధన చేస్తున్న హార్దిక్‌ ‌పాండ్య కాలు కండరాల నొప్పికి గురైనట్టు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌‌లోనూ వెన్ను నొప్పి కారణంగా హార్దిక్‌ ‌పాండ్య ముంబయి ఇండియన్స్‌‌కు 10 మ్యాచ్‌‌ల్లోనే ఆడాడు. ఫిట్‌‌నెస్‌ ‌సమస్యలు ఉన్నప్పటికీ రోహిత్‌ ‌శర్మ, హార్దిక్‌ ‌పాండ్యను సెలక్ష‍న్‌‌ కమిటీ వన్డే జట్టుకు ఎంపిక చేసింది. హార్దిక్‌ ‌పాండ్య గాయం, అఫ్గాన్‌‌తో సిరీస్‌‌కు దూరమైన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పేస్‌ ఆల్‌‌రౌండర్‌ ‌నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సైతం వన్డే జట్టులో ఉండటంతో హార్దిక్‌ ‌స్థానంలో మరో ఆల్‌‌రౌండర్‌‌ను ఎంపిక చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ ‌నెగ్గిన జట్టులో సభ్యుడైన హార్దిక్‌ పాండ్యను సెలక్ష‍న్‌ ‌కమిటీ టీ20 జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్‌‌కప్‌ ‌కోసం హార్దిక్‌ ‌పాండ్య ఫిట్‌‌నెస్‌, పనిభారాన్ని బీసీసీఐ పర్యవేక్ష‍ిస్తున్నా.. బరోడా స్టార్‌ ‌తరచుగా గాయాల పాలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -