ముస్లింలపై విద్వేషపూరిత మతోన్మాద దాడుల్ని అరికట్టాలి

– నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై ఏక రీతిన పెద్దయెత్తున జరుగుతున్న దాడులను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. చత్తీస్‌గఢ్‌ రాజధాని రారుపూర్‌లో ఎద్దులను రవాణా చేస్తున్న ముగ్గురు ముస్లిం యువకులను ఆవుల స్మగ్లర్లుగా ముద్ర వేసి గో గూండాలు కొట్టి చంపేశారు.. అలీగఢ్‌లో దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ ముస్లింను ఇదే విధంగా కొట్టి చంపేశారు. మధ్యప్రదేశ్‌లోని మండాలాలో ఫ్రిజ్‌లో గొడ్డు మాంసం ఉన్నట్లు వార్తలు వచ్చిన 24 గంటల్లోనే ముస్లింలకు చెందిన 11 ఇళ్లుధ్వంసం చేశారు. లక్నోలో ముస్లింలు ఎక్కువగా వుండే అక్బర్‌నగర్‌లో రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం పేరుతో ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయడంతో వెయ్యి కుటుంబాల దాకా వీధిపపడ్డాయి.. గుజరాత్‌ వడోదరలో ముఖ్యమంత్రి గృహ నిర్మాణ పథకం కింద అల్పాదాయ వర్గ గృహ సముదాయంలో ముస్లిం మహిళకు ఫ్లాట్‌ కేటాయించినం దుకు ఆ దగ్గరలో ఉన్న హిందువులు బహిరంగంగానే నిరసన తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నహన్‌లో . ఈద్‌ అల్‌ అదా సందర్భంగా ఆవును బలి ఇచ్చారని ఆరోపిస్తూ ముస్లింల దుకాణాన్ని లూటీ చేసి, ధ్వంసం చేశారు. గో వధకు పాల్పడ్డారంటూ కేసు కూడా పెట్టారు ఈ విధంగా 16 మంది షాపు యజమానులు బలవంతంగా దుకాణాలు వీడి పారిపోయేలా చేశారు.. ఢిల్లీలోని సంగమ్‌ విహార్‌లో ఓ ప్రార్థనా స్థలానికి సమీపంలో గో కళేబరం దొరికిందంటూ హిందూత్వ సంస్థల సభ్యులు ఉన్మాదపూరిత ప్రసంగాలు చేయడంతో అక్కడ నివాసం వుంటున్న వారు భయంతో పారిపోతున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలినప్పటి నుంచి మతోన్మాద దాడులు మరింత ముమ్మరమయ్యాయి.. . బీజేపీ, హిందూత్వ మతోన్మాద శక్తులు మతపరమైన సమీకరణ కోసం ఉన్మత్తపూరిత దాడులతో పేట్రేగి పోతున్నాయి. ఈ మీతోన్మాద శక్తుల కుతం త్రాలు, కుటిల పన్నాగాల పట్ల అత్యంత అప్రమత్తంగా వుండాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తన అన్ని శాఖలకు పిలుపు నిచ్చింది. వాతావరణాన్ని చెడగొట్టేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసే ఇటువంటి విషపూరితమైన దాడులకు, చేష్టలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పొలిట్‌బ్యూరో కోరింది.

Spread the love