ప్ర‌భాస్ క‌ల్కి ట్రైల‌ర్ చూశారా.. మ‌రో ప్ర‌పంచం వ‌స్తుంది

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ప్రభాస్, దీపికలతో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్, అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్స్, ప్రభాస్ బుజ్జి కారు కల్కి సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా సోమవారం (జూన్ 10) కల్కి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కల్కి సినిమాలో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్ హాసన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించనున్నారు. వీరితో పాటు కల్కి సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించారు. ఇప్పటికే వీరి లుక్స్ కు సంబంధించిన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ట్రైలర్ తోనే దుమ్ము రేపిన ప్రభాస్ సినిమా రిలీజయ్యాక మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Spread the love