ప్రమాణస్వీకార వేళ: ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్ సహా ముఖ్యులు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వేళ కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోట చేసుకున్నాయి. గవర్నర్ తమిళిసై కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గవర్నర్ కాన్వాయ్ ఇంకా ట్రాఫిక్‌లోనే ఉండిపోయింది. ఒంటిగంటకు సభకు చేరుకోవాల్సిన గవర్నర్ ట్రాఫిక్ జామ్ వలన ఆలస్యమైంది. స్టేడియం వైపుకు గవర్నర్ కాన్వాయ్‌ను పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎల్బీస్టేడియం వరకు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు వైఫల్యాలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. చివరకు అందరినీ ఒకే వాహనంలో ఎల్బీస్టేడియానికి పోలీసులు పంపించి వేశారు. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ట్రాఫిక్‌లో ఇర్కుపోయారు.

Spread the love