బడి ఎన్నికల కోసం భారీగా పోటీ !

– జాబితా తయారీ లో ఉపాధ్యాయులు
– ఈ నెల 29న ఎన్నికలు
నవ తెలంగాణ – చందుర్తి
ప్రయివేట్ పాఠశాలలు మినహాయిస్తే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ లకు శనివారం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు జాబితా తయారు చేయనున్నారు. దీంతో ఈ కమిటీకి భారీగా పోటీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
నాలుగు సంవత్సరాలుగా పాత కమిటీ లే: పాఠశాల నిర్వహణ కమిటీ గత నాలుగు సంవత్సరాలుగా పాత కమిటీ లే కొనసాగుతున్నాయి.2019 నవంబర్ లో వేసిన నిర్వహణ కమిటీలు ఇప్పటి వరకు కోసాగుతున్నాయి.ప్రతి రెండు సంవత్సరాల కొక సారి నూతన కమిటీ లు వేయాలి కానీ ప్రభుత్వ ఉత్తర్వులు రాక పోవడంతో నాల్గు సంవత్సరాలుగా పాత కమిటీలు నిర్వహణ కొనసాగాయి.దీంతో విద్య శాఖ  అధికారులకు పాఠశాల విద్య కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా ఉపాధ్యాయులు నూతన కమిటీల కోసం జాబితా తయారీలో ఉన్నారు.
47 ప్రభుత్వ   పాఠశాలల కు నూతన కమిటీలు: మండలంలోని పంతొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు 35 మండల పరిషత్,12 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1వ తరగతినుండి 5వ తరగతి  వరకు ఒక కమిటీ,6 వ తరగతి నుండి 8వ తరగతి వరకు మరో కమిటీ ఉంటుంది. గతంలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు పాఠశాల లో చదువు పూర్తికాగా  ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ నుండి తప్పుకుని కొత్తగా ప్రవేశం ఉన్న విద్యార్థుల తలి తండ్రులు పోటీలో ఉండనున్నారు.దీంతో ఈ నెల 29న జరిగే పాఠశాల నిర్వహణ కమిటీ  ఎన్ని కలకు భారీ గా పోటీ పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.

Spread the love