– విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి గుడికి వెళ్లడం తప్పనిసరేం కాదు : సుప్రీంకోర్టు
– విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : హిందూయిజం అనేది జీవన విధానమని, ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి గుడికి వెళ్లడం లేదా పూజలు చేయడం తప్పనిసరేం కాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. హిందూయిజంపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని తేల్చి చెప్పింది. కేరళలోని శబరిమల ఆలయం సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లతో పాటు దావూదీ బోహ్రాలతో సహా పలు మతాలు పాటించే మత స్వేచ్ఛ పరిధిపై విచారణ జరిపే క్రమంలో బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోరు మాల్యా బాగ్చి కూడా ఉన్నారు.
శబరిమల ఆలయ ప్రవేశ తీర్పు
– పునస్సమీక్ష పిటిషన్లపై విచారణ
శబరిమల ఆలయ ప్రవేశ తీర్పును 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
హిందూయిజం ఒక జీవన విధానం
- Advertisement -
- Advertisement -



